గర్భిణులకు ప్రసవం చేసేందుకు భూమిపై వెలిసిన గర్భరక్షాంబిక..

గర్భిణితో ఉన్న మహిళలు ప్రసవించడమంటే మరో జన్మ ఎత్తడమే. అలాంటి గర్భిణులకు సుఖ ప్రసవం చేసేందుకు సాక్షాత్తు జగన్మాతే భూమిపై ‘గర్భరక్షాంబిక’గా వెలిశారు. ఎక్కడ అంటారా? తమిళనాడులోని తంజావూరు జిల్లాలోని తిరుకరుకావుర్‌లో ఈ అమ్మవారు అవతరించారు. గర్భిణులు ఈ అమ్మవారికి మొక్కితే చాలు సుఖ ప్రసవం జరిగి తల్లీ బిడ్డ క్షేమంగా ఉంటారట. స్థల పురాణం ప్రకారం.. నిరువతర్ అనే రుషి తన సతీమణి వేదికతో కలిసి వెన్నర్ నది సమీపంలో నివసించారు. వారి ఇంటికి ఒకరోజు ఒర్తువపతర్ అనే రుషి నిరువతర్ లేని సమయంలో భోజనానికి వచ్చాడు.

గర్భవతి అయిన వేదికకు ఆహారం తీసుకురావడం కాస్త ఆలస్యమైంది. రుషికి తీవ్ర ఆగ్రహం వచ్చింది. గడ్భంలోని శిశువు ప్రాణాలతో ఉండదని శపించి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. అప్పుడు వేదిక జగన్మాతను ప్రార్థించింది. అమ్మవారు గర్భరక్షాంబికగా వచ్చి గర్భానికి ప్రాణం పోసింది. వేదిక పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. సాక్షాత్తు అమ్మవారు గర్భవతి అయిన వేదిక కోసం రావడంతో ఈ స్థలం పవిత్రస్థలంగా ప్రసిద్ధికెక్కింది. జగన్మాత గర్భరక్షాంబికగా పరమేశ్వరుడు ముల్లైవననాధర్‌గా భక్తులను కరుణిస్తుంటారు.

Share this post with your friends