తిరుమలలో భక్తుల రద్దీ శనివారం ఔటర్ రింగ్ రోడ్డు, శిలా తోరణం వరకు క్యూ లైన్లు కొనసాగుతున్నాయి. వేసవి సెలవులతో పాటు వారాంతపు రద్దీతో దేశం నలుమూలల నుండి తిరుమలకు వచ్చిన భక్తులతో పోటెత్తింది. గత 10 రోజుల్లో శ్రీవారి మెట్టు, అలిపిరి నడక మార్గాల్లో దాదాపు 2.60 లక్షల మంది భక్తులు తిరుమలకు చేరుకొని శ్రీవారిని దర్శించుకున్నారు.
శ్రీవారి సేవకులు అన్నప్రసాదం, ఆరోగ్య, విజిలెన్స్ విభాగాలపై ప్రత్యేక దృష్టి సారించి అన్ని కీలక ప్రదేశాల్లో సేవలందిస్తున్నారు. ఇందులో భాగంగా శిలాతోరణం, బాట గంగమ్మ గుడి, మార్గలలో శ్రీవారి దర్శనం కోసం క్యూలైన్లలో ఉన్న భక్తుల సౌకర్యార్థం 27 ప్రాంతాల్లో తాగునీరు, 4 ప్రాంతల్లో అన్నప్రసాదాలు అందిస్తున్నారు. భక్తుల సౌకర్యార్థం అక్టోపస్ భవనం నుండి శిలాతోరణం వరకు ప్రత్యేకంగా 8 బస్సులు ఏర్పాటు చేసి ప్రతి నిమిషానికి భక్తులను చేరవేసేలా చర్యలు తీసుకున్నారు.