అయోధ్య రామయ్య చలువతో దుబ్బాక చేనేత వస్త్రానికి మహర్దశ

అయోధ్య రామయ్య చలువతో దుబ్బాక చేనేత వస్త్రానికి మహర్దశ పట్టింది. ఒక్కసారిగా దేశం మొత్తం దుబ్బాక వైపు తిరిగింది. అసలు రామయ్య చలువేంటి? ఆయనేం చేశాడంటారా? దుబ్బాక హ్యాండ్లూమ్స్ కంపెనీలో తయారైన లెనిన్‌ ఇక్కత్‌ పింక్ కలర్ చేనేత వస్ర్తాన్ని అయోధ్య రాముడికి సంస్థ ఎండీ బోడ శ్రీనివాస్ బహుమతిగా పంపించారు. ఆ చేనేత వస్త్రంలో అయోధ్య రామయ్య మరింత చూడ చక్కగా ఉన్నాడట. దీంతో వారం రోజుల పాటు రోజుకో రంగుతో తయారైన వస్ర్తాన్ని శ్రీరాముడికి అలంకరించేందుకు అర్డర్‌ను ఇచ్చారు ఆలయ అధికారు. అయోధ్య రామయ్య అలంకరణకు తాము చేస్తున్న వస్త్రాలు ఎంపికయ్యాయంటే ఎవరికైనా ఎంత ఆనందంగా ఉంటుంది? ఇప్పుడు అదే ఆనందాన్ని దుబ్బాక చేనేత కళాకారులు అనుభవిస్తున్నారు.

ప్రతి సోమవారం నుంచి ఆదివారం వరకు రామయ్యకు అలంకరించేందుకు వివిధ రంగులతో నేసిన వస్త్రాలను అయోధ్య రామాలయం ఆర్డర్ చేసింది. అయితే ఈ రంగులతో కూడిన వస్త్రాలను డిజైనర్‌ మనీశ్‌త్రిపాఠి ఎంపిక చేస్తారని శ్రీనివాస్‌ తెలిపారు. ప్రస్తుతానికి మాత్రం రెండు రంగులతో కూడిన రెండు డిజైన్‌ లినెన్‌ ఇక్కత్‌ వస్రాలను అందించారట. ప్రతి వస్త్రం 12 మీటర్ల పొడవు ఉంటుంది. ఆదివారం బాల రామయ్యను పింక్ కలర్ వస్త్రంతో అలంకరిస్తూ ఉంటారు. ఈ నిబంధన కారణంగా దుబ్బాక చేనేత కార్మికులు పంపించిన వస్త్రాన్ని అలంకరించడం జరిగింది. గత ఫిబ్రవరిలో దుబ్బాకలో తయారైన లినెన్‌ చీరకు.. నేసిన కార్మికులకు ప్రశంసలు దక్కాయి. ఢిల్లీలో జాతీయ స్థాయిలో కేంద్ర చేనేత, జౌళీ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో విరాసత్‌ పేరిట చేనేత చీరల ప్రదర్శన జరిగింది. దీనిలో దుబ్బాక లినెన్‌ చీరకు స్థానం దక్కింది.

Share this post with your friends