నేడు వరుథిని ఏకాదశి.. పొరపాటున కూడా ఈ పనులు చేయకండి..

చైత్ర మాసంలోని కృష్ణ పక్షంలో వచ్చే ఏకాదశిని వరుథిని ఏకాదశి అంటారు. ఇక ఈ ఏడాది వరుథిని ఏకాదశి ఎప్పుడో కాదు.. ఇవాళే. ఇవాళ చాలా మంది ఉపవాసం చేస్తుంటారు. ప్రత్యేకంగా ఇవాళ్టి ఉపవాసం విష్ణుమూర్తి అవతారమైన వరహ అవతారానికి అంకితం చేయబడుతుంది. ఈ రోజున ఏకాదశి వ్రతాన్ని ఆచరించిన వారికి వైకుంఠం ప్రాప్తిస్తుందట. అయితే ఈ రోజు చేయాల్సిన.. చేయకూడని పనులు కొన్ని ఉన్నాయి. అవేంటో చూద్దాం.

ఏం చేయకూడదంటే..

* ఈ రోజు బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేచి శుచిగా స్నానమాచరించి ఉపవాసాన్ని ప్రారంభించాలి.
* వరుథిని ఏకాదశి వ్రతం చేసేవారు పగటి సమయంలో నిద్రించకూడదు.
* ఏకాదశి రోజున మద్యం, మాంసంతో పాటు తామసిక పదార్థాలను సేవించకూడదు.
* ఏకాదశి రోజున కోపం తెచ్చుకోవడం.. దుర్భాషలాడటం లేదంటే అబద్ధాలు చెప్పడం చేయకూడదు.
* పొరపాటున కూడా తులసి ఆకులను తెంపడం వంటివి చేయకూడదు.

ఏం చేయాలంటే..

* ద్వాదశి తిథి ముగిసేలోపు వ్రతాన్ని ముగించాలి. ఇవాళ దానధర్మాలు చేయడం చాలా మంచిది.
* ఇవాళ శ్రీమహావిష్ణువును, లక్ష్మీదేవిని పూజించాలి.
* ద్వాదశి తిథి వరకు అంటే ఏకాదశి మరుసటి రోజు వరకూ ఏకాదశి ఉపవాసం పాటించాలి.
* ఏకాదశి ఉపవాసం చేసే భక్తులు తప్పనిసరిగా భాగవతాన్ని పఠించాలి.

Share this post with your friends