శ్రావణ మాసంలో మాంసాహారాన్ని ఎందుకు నిషేధించాలో తెలుసా?

శ్రావణమాసాన్ని హిందువులు చాలా పవిత్రమైనదిగా చూస్తారు. ఈ నెలలోనే పండుగలు, శుభకార్యాలు ఎక్కువగా ఉంటాయి. అయితే ఈ నెలలో మాంసాహారం తినడం నిషేధమని అంటారు. చాలా మంది ఈ నెల మొత్తం మాంసాహారం తినరు. అసలు దీనికి కారణమేంటో తెలుసా? ఈ నెలలో ప్రతిరోజూ రోజుకో దేవుడిని పూజిస్తూ ఉంటారు కాబట్టి మాంసాహానికి దూరంగా ఉంటారు. ఇక శాస్త్రీయ పరమైన కారణమేంటంటే.. ఈ మాసంలో రోగ నిరోధక శక్తి చాలా తక్కువగా ఉంటుంది. పైగా వర్షాలు జోరుగా కురుస్తాయి. కాబట్టి మాంసాహారం, మసాలా పదార్థాలను ఎక్కువగా తింటే పెద్దగా జీర్ణం కాదు కాబట్టి మాంసాహారారినికి దూరంగా ఉండాలంటారు.

మరో శాస్త్రీయ కారణం ఏంటంటే.. శ్రావణ మాసంలో మన శరీరంతో పాటు జీర్ణ వ్యవస్థ అత్యంత బలహీనంగా ఉంటుందట. పైగా వర్షాల కారణంగా అంటు వ్యాధులు అత్యంత వేగంగా ప్రబలుతూ ఉంటాయి. ఈ సమయంలో మాంసాహారం తీసుకుంటే బాడీ అనారోగ్యానికి గురయ్యే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుందట. కాబట్టి మాంసాహారానికి దూరంగా ఉంటారు. మరో కారణం కూడా ఉంది. అదేంటంటే.. శ్రావణ మాసంలో జంతువులు ఎక్కువగా ప్రసవిస్తూ ఉంటాయి. ఈ సమయంలో వాటిని వధించడం ఏమాత్రం మంచిది కాదు. కాబట్టి శ్రావణ మాసంలో మాంసాహారానికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిదట.

Share this post with your friends