పెళ్లిలో బాసికం ఎందుకు కడతారో తెలుసా?

హిందూ పెళ్లి తంతు మొత్తం పురాతన కాలం నుంచి నిర్వహించుకుంటున్న పద్ధతిలోనే జరుగుతూ ఉంటుంది. దీనిలో మార్పులు చేర్పులు ఏమీ ఉండవు. వీటి వెనుక కొన్ని శాస్త్రీయపరమైన కారణాలు కూడా ఉంటాయి. హిందువులు ఏ పని చేసినా ముందుగా భగవంతుణ్ని ఆరాధించే మొదలు పెడతారు. భగవంతున్ని ఆరాధిస్తే ఎలాంటి విఘ్నాలు లేకుండా మంచిగా పనులు జరుగుతాయని నమ్మకం. ఈ క్రమంలోనే హిందూ వివాహ పద్ధతిలో వధూవరులకు నుదుటన బాసికం కడతారు. ఇలా కట్టడం వెనుక హిందూ ధర్మమే కాదు.. శాస్త్రీయపరమైన కారణాలు కూడా ఉన్నాయి.

మానవ శరీరంలో మొత్తం 72 వేల నాడుల్లో 14 నాడులు అత్యంత కీలకమైనవి. అవి ఎప్పుడూ శరీరంలో చాలా యాక్టివ్‌గా పని చేస్తుంటాయి. ఇక ఈ 14 నాడుల్లోనూ ఇడ, పింగళ, సుషుమ్న అనే మూడు నాడులు చాలా ముఖ్యమైనవి. సుషుమ్న నాడి గురించి చెప్పాలంటే.. దీనికి కుడివైపున సూర్యనాడి… ఎడమవైపు చంద్రనాడులు ఉంటాయి. ఈ సూర్య, చంద్ర నాడులు కలిసే ప్రాంతమే మన నుదురు. దీనిపై బాసికం కడిగే వధూవరులకు దిష్టి దోషాల వంటివి ఏమీ కలగకుండా ఉంటాయట. అలాగే వారికి ఆ సమయంలో అనారోగ్య సమస్యలేమీ రాకుండా ఉంటాయని బాసికాన్ని కడతారట.

Share this post with your friends