కలలో శివుడు కనిపిస్తే ఏం జరుగుతుందో తెలుసా?

నిద్రలో కలలు రావడం సర్వసాధారణమే. ఏదో పై నుంచి కింద పడిపోతున్నట్టు.. ఎవరో మరణించినట్టు.. ఏదో ప్రమాదం మనల్ని వెంటాడుతున్నట్టు వస్తుందటాయి. అరుదుగా కొన్ని సార్లు భగవంతుడు, ప్రకృతి కలలో కనిపిస్తూ ఉంటాయి. వాస్తవానికి ఉదయం ఏ విషయం గురించైనా బాధపడినా.. లేదంటే భయ పడినా.. ఎక్కువగా ఆలోచించినా అవే ఘటనలు కలలో వస్తుంటాయి. కానీ వాటికి కూడా ఓ కారణం ఉంటుందని స్వప్న శాస్త్రం చెబుతోంది. ఉదాహరణకు కలలో శివుడు మాత్రమే కాదు.. ఆయనకు సంబంధించిన విషయాలేవైనా సరే కనిపిస్తే అవి కొన్ని ఫలితాలకు సంకేతమని అంటారు. అవేంటో చూద్దాం.

కలలో భగవంతుని దర్శనమనేది చాలా అరుదుగా జరుగుతూ ఉంటుంది. కలలో దైవాన్ని చూసే అదృష్టం ఎవరికో ఒకరికి వస్తుంది. మహాదేవుడు కానీ.. శివలింగం.. పాము.. శివాలయం ఇలా ఏది కలలో కనిపించినా మన దశ తిరగబోతోందని అర్థమట. కలలో పాము, శివలింగం కనిపిస్తే పక్కాగా శుభవార్తలు వింటారట. ఏ పని మొదలు పెట్టినా దిగ్విజయంగా పూర్తవుతుందట. శివుని రూపం కనిపిస్తే జీవితంలో మనకు మంచి చేసే ఏదో పెద్ద సంఘటన జరగబోతోందని అర్థమట. శివాలయం కనిపిస్తే అప్పటి వరకూ ఉన్న అనారోగ్యాలన్నీ మాయమవుతాయట. ఇక కలలో శివలింగం కనిపిస్తే మనం చేపట్టే పనులు దిగ్విజయంగా పూర్తవుతాయట. గర్భవతికి శివలింగం కనిపిస్తే కొడుకు జన్మిస్తాడట.

Share this post with your friends