పశుపతినాథ్ అని శివుడిని పిలుస్తారు. శివుడు పశుపతినాథ్‌గా పిలవబడే ఆలయం కేదారనాథ్‌లో ఉంది. 12 జ్యోతిర్లింగాల్లో ఒకటిగా కేదార్‌నాథ్ పరిగణించబడుతుంది. నేపాల్ రాజధాని ఖాట్మండుకు వాయువ్యంగా 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న దేవ్‌పటాన్ గ్రామంలో బాగ్మతి నది ఒడ్డున పశుపతినాథ్ ఆలయం ఉంది. క్రీస్తుపూర్వం మూడవ శతాబ్దంలో సోమదేవ్ రాజవంశానికి చెందిన పశుప్రేక్ష అనే రాజు పశుపతినాథ్ ఆలయాన్ని నిర్మించాడని స్థల పురాణం చెబుతోంది. ఈ ఆలయ విశిష్టతలు చాలానే ఉన్నాయి. ఈ ఆలయంలోకి హిందుయేతరులకు ప్రవేశం లేదు. హిందూయేతరులెవరైనా చూడాలంటే బయటి నుంచి చూడాల్సిందే.
ఆలయ గర్భగుడిలో పంచముఖి శివలింగం ఉంటుంది. వాస్తవానికి ఇలాంటి పంచముఖి శివలింగం ప్రపంచంలోనే మరెక్కడా లేదంటారు. ఈ ఆలయం కొన్ని వేల యేళ్ల కిందట నిర్మించబడింది. ఈ జ్యోతిర్లింగ దర్శనం ద్వారా మనిషి మోక్షాన్ని పొందుతాడని నమ్మకం. అయితే ఆసక్తికర విషయం ఏంటంటే.. ఎక్కడి శివాలయంలోనైనా ముందుగా నందిని దర్శించుకుంటాం. ఇక్కడ మాత్రం మనం శివుని దర్శనానికి ముందు నందిని దర్శించుకోకూడదట. ఇలా దర్శించుకుంటే మృగరూపంలో జన్మిస్తామట. ఇక పశుపతినాథ్ కోసం ఆలయ వెలుపల ఉన్న ఆర్య ఘాట్ నుంచి మాత్రమే నీటిని తీసుకెళతారు. ఇది ఒక్కడ చాలా కాలంగా కొనసాగుతున్న నిబంధన. వేరే ప్రదేశంలోని నీటిని తీసుకొస్తే మాత్రం ఆలయ ప్రాంగణంలోకి ప్రవేశించలేరట. ఇక శివలింగానికి ఉండే పంచ ముఖాలు.. దక్షిణం వైపు ఉన్న ముఖాన్ని అఘోర ముఖమని.. పడమర, తూర్పు, ఉత్తరం వైపు ఉన్న ముఖాలను సద్యోజాత్, తత్పురుష, అర్ధనారీశ్వరుడని అంటారు. ఇక పైకి ఉండే ముఖాన్ని ఇషాన్ అని పిలుస్తారు.