అయోధ్య రామమందిర నిర్మాణంతో యావత్ భారతావని ఆనంద డోలికల్లో తేలియాడుతోంది. ఎంతో మంది దేశ వ్యాప్తంగా ఇప్పటికే అయోధ్యను దర్శించుకున్నారు. ఇక రామయ్యకు పెట్టిన తిలకం గురించి ఎప్పుడైనా ఆలోచించారా? చాలా రకాలుగా కోదండ రామునికి తిలక ధారణ చేస్తారు. శ్రీరామునికి ఎన్ని రకాల తిలకాలు పెడతారు? వాటికి ఉన్న ప్రాముఖ్యతేంటో తెలుసుకుందాం.
కుంకుమ తిలకం: ప్రత్యేక సందర్భాల్లో మాత్రమే కుంకుమ తిలకాన్ని శ్రీరాముడికి పెడతారు. కుంకుమను శుభానికి అలాగే శ్రేయస్సుకి చిహ్నంగా భావిస్తారు కాబట్టి ఈ తిలకం శ్రీరాముని ఆశీస్సులు, అదృష్టాన్ని అందించడానికి చిహ్నంగా భావిస్తుంటారు.
సింధూర తిలకం: ఈ సింధూర తిలకాన్ని హోలీ పండుగ రోజున స్వామివారికి పెడతారు. ఉత్సాహంతో పాటు ఆనందానికి సింధూరం ప్రతీక. రామయ్యకు సంతోషాన్ని అందించడానికి ఈ తిలకాన్ని పెడతారు.
చందనం తిలకం: ఇది అత్యంత సాధారణ తిలకం. గర్భగుడిలోని బాల రామయ్యను ఆరాధించే సమయంలో ప్రతి రోజూ పెడుతుంటారు. చందనం గుణం వచ్చేసి చల్లదనంతో పాటు పవిత్రం. కాబట్టి రామయ్యకు శాంతి, చల్లదనాన్ని అందించాలని ఈ తిలకం పెడతారు.
పసుపు తిలకం: పసుపును సాధారణంగా శుభకార్యాల్లో వాడుతారు. పసుపు ఒక పవిత్రమైన ఆరోగ్యాన్ని అందిస్తుంది. ఈ తిలకం శ్రీరాముడికి ఆరోగ్యాన్ని, ఆయురారోగ్యాలను అందించాలని పెడుతుంటారు.
అష్టగంధ తిలకం: దీనిని కొన్ని ప్రత్యేక సందర్భాల్లో మాత్రమే రామయ్యకు పెడతారు. అష్ట గంధ తిలకాన్ని.. గంధం, కర్పూరం, కుంకుమ, అగరు, జాజికాయ, లవంగం, ఏలకులు, గోరోచనం వంటి ఎనిమిది పదార్థాలతో తయారు చేస్తారు. ఈ తిలకం శ్రీరాముని రూపానికి మరింత తేజస్సును జోడిస్తుంది.
విభూతి తిలకం: విభూతి తిలకం శివరాత్రి వంటి మతపరమైన సందర్భాలలో పెడతారు. విభూతి అనేది శక్తి, త్యాగాలకు చిహ్నం. రామయ్యకు బలం, నిగ్రహాన్ని అందించాలని ఈ తిలకం పెడతారు.
పువ్వులు, ఆకులతో తిలకం: వివిధ రకాల పువ్వులు, ఆకులతో కూడా రామయ్యకు తిలకం తయారు చేసి పెడతారు. ఈ తిలకానికి వినియోగించే ప్రతి పువ్వు లేదా ఆకుకు దాని సొంత మతపరమైన ప్రాముఖ్యాన్ని కలిగి ఉంటుంది.