ఆంజనేయ స్వామి ఎన్ని అవతారాలు ధరించారో తెలుసా?

ఎక్కడ రామనామం వినిపిస్తుందో అక్కడ ఆంజనేయస్వామి ప్రత్యక్షమవుతారని మనం నమ్ముతూ ఉంటాం. ప్రతి శ్రీరాముని ఆలయంలోనూ హనుమంతుడు తప్పక ఉంటాడు. రామాయణంలో రాముడికి సరిసమానమైన ప్రాముఖ్యత హనుమంతుడిది. అపర భక్తి పరాయణుడు. అంజనాదేవి, కేసరిల కుమారుడే ఆంజనేయుడు. చైత్ర శుధ్ధపౌర్ణమినాడు, మూలానక్షత్రాన హనుమంతుడు జన్మించాడు. ఆయన జన్మస్థలం మహారాష్ట్రలోని త్రయంబకేశ్వరమని చెబుతారు. పురాణాల ప్రకారమైతే.. అంజనాదేవి ఒక అప్సరస అట. అయితే శాప కారణంగా భూలోకంలో వానర వంశంలో జన్మించిందట. శివుని వరంతోపుత్రుడు జన్మించాక ఆమె శాప విముక్తురాలైందట.

ఇక ఆంజనేయస్వామివారు మొత్తంగా తొమ్మిది అవతారాలు ధరించారు అవేంటో చూద్దాం..

1. ప్రసన్నాంజనేయస్వామి
2. వీరాంజనేయస్వామి
3. వింశతి భుజ ఆంజనేయస్వామి
4. పంచముఖ ఆంజనేయస్వామి
5. అష్టదశ భుజ ఆంజనేయస్వామి
6. సువర్చలాంజనేయస్వామి
7. చతుర్బుజ ఆంజనేయస్వామి
8. ద్వాత్రింశద్భుజ ఆంజనేయస్వామి
9. వానరాకార ఆంజనేయస్వామి.

Share this post with your friends