మహాభారతంలో పాండవుల గురించి అయితే అందరికీ తెలుసు. మరి ఉప పాండవుల గురించి కొందరికి మాత్రమే తెలుసు. ద్రౌపది, పంచ పాండవులు ఒక్కొక్కరికీ ఒక్కొక్క సంతానం జన్మించింది. ఆ ఐదుగురిని ఉప పాండవులనిపిలుస్తారు. ధర్మరాజు, ద్రౌపదికి పుట్టిన కుమారుడు ప్రతివింధ్యుడు, భీమునికి జన్మించిన కుమారుడు శ్రుతసోముడు, అర్జనుని సుతుడు శ్రుతకర్ముడు, నకులుని కుమారుడు శతానీకుడు, ఇక మహదేవుని పుత్రుడు శ్రుతశేనుడు. ఈ ఐదుగురు ఉప పాండవులు పూర్వ జన్మలో విశ్వులనే దేవతు.
ఇక వీరు ఉప పాండవులుగా జన్మించడానికి ఓ కథ ఉంది. పూర్వం ఒకనాడు హరిశ్చంద్రుని భార్య అయిన చంద్రమతికి మహర్షి అయిన విశ్వామిత్రుడు ఒక శాపం ఇస్తాడు. ఆమెను నగరం వదిలి వెళ్లి పోవాల్సిందిగా శపిస్తాడు. అది చూసిన విశ్వవులు ఋషులకు ఇంత కోపం పనికిరాదని తమలో తాము అనుకుంటూ ఉంటారు. అది విన్న విశ్వామిత్రునికి కోపం మరింత పెరిగి విశ్వులకు సైతం శాపం ఇస్తాడు. ఆ శాప ఫలితంగానే విశ్వులు నరులుగా జన్మించి.. ఉపపాండవులుగా కీర్తించబడ్డారు.