సిరిమానోత్సవం గురించి మీకు తెలుసా? కర్రకు పూజారిని వేలాడదీసి..

భారతదేశం ఎన్నో ఆలయాలకు పుట్టినిల్లు అనడంలో సందేహం లేదు. ప్రతి గ్రామంలో తప్పని సరిగా ఓ దేవాలయం అయితే ఉంటుంది. అయితే కొన్ని గ్రామాల్లో కొన్ని ఉత్సవాలు సైతం జరుగుతుంటాయి. ఈ ఉత్సవాల గురించి మనకు పెద్దగా తెలియదు. దేశంలోని ఎన్నో దేవాలయాల్లో కొన్ని ప్రత్యేక ఉత్సవాలను నిర్వహిస్తూ ఉంటారు. మన తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే ఏపీలో ప్రతి ఏటా ఒక ప్రత్యేక సంప్రదాయం ఉన్న పండుగ ఒకటి జరుగుతుంది. దీనికి దేశం నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు సందర్శిస్తూ ఉంటారు. అదే పైడితల్లి ఉత్సవం.

ఈ పండుగను ప్రతి సంవత్సరం సెప్టెంబర్ లేదా అక్టోబర్ నెలల్లో జరుపుకుంటారు. ఏపీలోని విజయనగరంలో ఉంది పైడితల్లి అమ్మవారి ఆలయం. ఇక్కడే ఏటా పెద్ద ఎత్తున పండుగ జరుగుతుంది. జాతరలో భాగంగా సిరిమాను ఉత్సవాన్ని నిర్వహిస్తారు. పైడితల్లి అమ్మవారిని ప్రసన్నం చేసుకోవడానికి ఇక్కడ పెద్ద ఎత్తున భక్తులంతా చేరి ఉత్సవాన్ని నిర్వహిస్తారు. సిరిమాను అంటే సన్న కర్ర అని అర్థం. ఈ ఉత్సవంలో భాగంగా పైడితల్లి అమ్మవారి దేవాలయంలో పూజారిని 60 అడుగుల పొడువన్న సన్నని కర్ర కొనకు వేలాడదీస్తారు. అనంతరం విజయనగరం కోట నుంచి ఆలయం మధ్య మూడు సార్లు ఊరేగింపుగా తీసుకెళతారు. ఈ ఉత్సవానికి ఏపీ నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు పెద్ద ఎత్తున హాజరవుతారు.

Share this post with your friends