శివుడు ఇద్దరి కుమార్తెల గురించి తెలుసా?

పరమేశ్వరుడిని ప్రతి రోజూ పూజించుకుంటాం. ఆయన కుమారుడంటే మనకు తెలిసింది వినాయకుడు, కార్తికేయుడు, అయ్యప్ప స్వామి గురించి మనకుమాత్రమే తెలుసు. శివుడికి వీరిద్దరే కాదు.. ఇంకో ఆరుగురు సంతానం కూడా ఉన్నారు. పురాణాల ప్రకారం శివుడికి 8 మంది పిల్లలు. వీరందరికీ ఎవరికి వారికి ఆలయాలు కూడా ఉన్నాయి. వీటి గురించిన ప్రస్తావన పురాణాల్లోసైతం ఉంది. ఇక ఈ 8 మందిలో ఇద్దరు అమ్మాయిలు కూడా ఉన్నారు. శివుడి కుమార్తె పేరు అశోక సుందరి. కార్తికేయుడి తర్వాత శివపార్వతులకు అశోక సుందరి జన్మించింది. పార్వతీదేవి తన ఒంటరితనాన్ని అధిగమించాలంటే కూతురు ఉండాలని భావించింది.

పార్వతీ దేవి కల్ఫ వృక్షాన్ని పూజించి అశోక సుందరిని వరంగా పొందింది. అయితే దక్షిణ భారత దేశంలో అశోక సుందరి.. త్రిపుర సుందరిగా పిలవబడుతోంది. శివుని మరో కుమార్తె మానసాదేవి. ఈమెను వాసుకి అని కూడా పిలుస్తారు. పురాణాల ప్రకారం శివుని చిన్న కుమార్తె అని చెబుతారు. హరిద్వార్‌లో మానసాదేవి ఆలయం ఉంది. అయ్యప్ప స్వామి గురించి దేశం మొత్తానికి తెలుసు. సాగర మథనం సమయంలో విష్ణువు మోహినీ రూపాన్ని ధరించిన విషయం తెలిసిందే. అప్పుడు శివుడు మోహిని పట్ల ఆకర్షితుడవడంత హరిహర సుతుడు అయ్యప్ప జన్మించాడు. పరుశురాముడితో యుద్ధం చేయగల ఏకైక దేవుడని అయ్యప్పను చెబుతారు.

Share this post with your friends