ప్రదోష వ్రతం గురించి తెలుసా? ఇది ఏ రోజున చేస్తారంటే..

ప్రదోష వ్రతం గురించి చాలా తక్కువ మందికి తెలిసి ఉంటుంది. దీనికి హిందూ మతంలో చాలా ప్రాముఖ్యత ఉంది. ఈ పవిత్రమైన రోజున ఉపవాసం ఉండి శివుడికి ప్రత్యేక పూజలు చేస్తారు. ఇక ఈ ఏడాది ఈ వ్రతాన్ని ఎప్పుడు ఆచరించాలంటే.. ఈ వ్రతం ప్రతి నెల శుక్ల పక్షం, కృష్ణ పక్షంలోని త్రయోదశి తిథి సోమవారం ఆచరిస్తారు. అంటే 2024 మే 20 సోమవారం నాడు అన్నమాట. సోమవారం నాడు చేస్తారు కాబట్టే దీనిని సోమ ప్రదోష వ్రతమని అంటారు. ఇక ఈ వ్రతాన్ని సాయంత్రం వేళ పాటిస్తారు. శివయ్యను ఆరాధించేందుకు ఇదే అత్యంత పవిత్రమైన సమయం.

ఈ రోజున వ్రతం చేస్తే పాపాలు నశించి.. పుణ్యంతో పాటు కోరికలన్నీ నెరవేరుతాయట. ఎంత కష్టపడి పనిచేసినా పనికి తగిన ప్రతిఫలం లేకపోగా కష్టాలు ఎదుర్కోవల్సి వస్తే ఈ వ్రతం చేసి శివలింగానికి అక్షితలు, తేనె సమర్పించాలి. ఫలితం వెంటనే వచ్చేస్తుంది. అలాగే పితృదోషం పోవాలన్నా కూడా ఈ వ్రతం ఆచరించాలి. ఆర్థిక కష్టాల నుంచి గట్టెక్కేందుకు.. ఆశించిన ఫలితాలు రాబట్టుకునేందుకు సోమ ప్రదోషం రోజున శివలింగానికి పాలు సమర్పించడం వల్ల కోరిన కోరికలన్నీ నెరవేరుతాయి. రుణ భారం పెరిగి పోతుంటేసోమ ప్రదోష వ్రతం రోజున శివలింగానికి పెరుగును సమర్పిస్తే చాలట. రుణ బాధల నుంచి విముక్తి లభిస్తుందట. వివాహం జరగకున్నా.. వైవాహిక జీవితంలో ఇబ్బందులున్నా సోమ ప్రదోష వ్రతం రోజున శివలింగానికి బిల్వ పాత్రలను సమర్పించాలి. జీవితం సుఖంగా సాగుతుంది.

Share this post with your friends