సీతాదేవి నిర్మించిన వంట గది ఎక్కడుందో తెలుసా?

మన దేశంలో పురాణాలకు సంబంధించిన ఆనవాళ్లు నేటికీ చాలా ఉన్నాయి. నిజంగా రాములవారు ఉన్నారా? రామాయణం జరిగిందా? శ్రీకృష్ణుడు ఉన్నాడా? కురుక్షేత్రం జరిగిందా? అంటే నిజమే పక్కాగా జరిగిందనడానికి సజీవ సాక్ష్యాలు ఎన్నో ఉన్నాయి. వాటిలో ఒకటి సీతమ్మ నిర్మించిన వంటగది. అవును.. సీతమ్మ నిర్మించిన వంటగది ఇప్పటికీ ఉంది. రాముడు తన జీవితంలో ఎక్కువ భాగం ప్రాపంచిక సంక్షేమం కోసమే గడిపాడనంలో సందేహం లేదు. సీతమ్మను పెళ్లాడి పట్టాభిషేకం చేసుకుని పాలన సాగిస్తాడనుకుంటే 14 ఏళ్ల పాటు అరణ్య వాసం చేయాల్సి వచ్చింది.

అలా శ్రీరాముడు అడవిలో ఉంటూ రాక్షస సంహారం గావించాడు. రాములవారు సీతమ్మతో పాటు లక్ష్మణుడితో కలిసి అడవిలో సంచరించిన ఆనవాళ్లు చాలా ఉన్నాయి. అలాంటి వాటిలోదే ఒకటి నాగ్‌పూర్‌కు 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న ‘రామ్‌టెక్ ఫోర్ట్’.ఈ ఫోర్ట్ గొప్పదనమేంటనే విషయాలను పక్కన పెడితే ఈప్రదేశం సీతాదేవికి చాలా ముఖ్యమైనదట. శ్రీరాముడు వనవాస సమయంలో చాలా కాలం ఈ ప్రదేశంలో గడిపాడట. అందుకే ఈ ప్రాంతానికి రామ్ టెక్ అనే పేరు వచ్చింది. ఇక సీతమ్మ తల్లి ఇక్కడే వంటగదిని నిర్మించి.. దానిలో అక్కడి రుషిపుంగవులందరికీ ఆహారం వండి వడ్డించేదట.

Share this post with your friends