గార్గి గురించి మీకు తెలుసా? ఆమె ఎవరంటే..

వేదకాలంలోనూ గొప్ప పండితురాళ్లు ఉన్నారు. వారిలో గార్గి ఒకరు. వాచక్ను మహర్షి కుమర్తె అయిన గార్గి జ్ఞానంలో మహర్షులను మించిపోయింది. జ్ఞానంలో ఋషి పుంగవుడైన యాజ్ఞవల్క్యుడినే ఆమె సవాలు చేసింది. అదెలాగంటే.. జనక మహారాజు శాశ్వత సత్య స్వరూపానికి సంబంధించి అభిప్రాయాలు ఇచ్చి పుచ్చుకునేందుకు పెద్ద పండితుల సభను ఏర్పాటు చేశారు. దీనికి దేశం నలుమూలల నుంచి యాజ్ఞవల్క్యుడు సహా వందల సంఖ్యలో ఇతర ఋషిపుంగవులు వచ్చారు. ఈ సభకు గార్గి కూడా హాజరైంది. అంతమందిని చూసిన జనక మహారాజు వారిలో అత్యంత విద్యా సంపన్నులెవరో తెలుసుకోవాలనుకున్నారు.

ఓ వేయి ఆవులను అక్కడకు తెప్పించి వాటి కొమ్ములకు బంగారం నిండిన సంచీలు కట్టించాడు. వారిలో అతి గొప్ప వేద వేదాంగ పారంగతుడు ఎవరో నిరూపించుకుని వారు ఈ గోవులను తమ ఇంటికి తోలుకుపోవచ్చని జనక మహారాజు ప్రకటించాడు. అంతా సైలెంట్‌గా ఉండిపోయారు. అప్పుడు యాజ్ఞవల్క్యుడు ఆ ఆవులను తమ ఆశ్రమానికి తోలుకుపోవాల్సిందిగా తన శిష్యుడికి ఆజ్ఞాపించాడు. అక్కడున్న వారందరికీ యాజ్ఞవల్క్యుడు సమాధానం ఇచ్చాడు. అందరూ సైలెన్స్.. అప్పుడు గార్గి లేచి నిలబడి ప్రశ్నలు అడగటం ప్రారంభించింది. యాజ్ఞవల్క్యుడు సంతృప్తి కరంగా సమాధానాలు ఇచ్చాడు. వీరిద్దరి మధ్య జరిగిన సంవాదం అప్పట్లో చర్చనీయాంశంగా మారింది.

Share this post with your friends