ఆడ నాగ సాధువుల గురించి తెలుసా? అలా మారడం ఎంత కష్టమంటే..

భారతదేశంలో సాధువులు, సన్యాసులు ఎక్కువే. నిజానికి ఈ ఆధ్యాత్మిక ప్రయాణానికి బాగా ఇష్టపడుతుంటారు. అయితే ఇది సాధారణ విషయమేమీ కాదు. కఠినమైన పరిస్థితులను ఎదుర్కోవాలి. మహిళలు సైతం నాగసాధువులుగా మారడమంటే చిన్న విషయమేమీ కాదు. పురుషులతో పోలిస్తే ఈ క్రమంలో మహిళలు ఎదుర్కొనే సవాళ్లు చాలా ఎక్కువ. ముందుగా స్త్రీ తన జీవితం గురించి గురువుకి చెప్పాలి. అప్పుడు ఆమె పూర్తిగా భగవంతుడికి అంకితమవుతుందా? లేదా? అనేది గురువు పరీక్షిస్తారు.అలాగే నాగ సాధువుగా మారడానికి ముందు స్త్రీ 6 నుంచి 12 ఏళ్ల పాటు బ్రహ్మచర్యం పాటించాలి.

ఈ బ్రహ్మచర్యం విషయంలో విజయం సాధిస్తేనే తత్సంబంధిత గురువు నుంచి నాగ సాధువుగా మారేందుకు అనుమతి లభిస్తుంది. ఆపై బంధాలన్నీ వదులుకోవాలి.. సర్వసుఖాలు, విలాసాలు అన్నీ వదిలిపెట్టాలి. ప్రాపంచిక ఆనందంతో సంబంధం లేకుండా జీవించేందుకు సిద్ధపడాలి. ఇంకో విషయం ఏంటంటే.. మహిళలు అత్యంత ఇష్టపడే జుట్టును వదులుకోవాలి. గుండుతో జీవించాలి. అలాగే ఏక వస్త్రం ధరించాలి. అవసరమైతే ఆయుధాలు కూడా దగ్గర పెట్టుకోవాలి. ఈ పరీక్షలన్నీ దాటాక స్త్రీ నాగ అమ్మ అవుతుంది. ఇక మహిళా సాధువులు కుంభం వంటి సందర్భాల్లో తప్ప బయట కనిపించరు. ఒక పొడవాటి కుట్టని వస్త్రాన్ని మాత్రమే ధరించాల్సి ఉంటుంది. గౌరవం విషయంలో మాత్రం పురుష సాధువులకు తీసి పోకుండా ఉంటుంది.

Share this post with your friends