దీపం వెలిగించేటప్పుడు ఆ పని మాత్రం చేయకండి..

చాలా మంది భగవంతుడికి పూజ చేసి దీపం వెలిగిస్తూ ఉంటారు. అయితే దీపం పెట్టడం ప్రధానం కానీ మిగిలిన నియమాలన్నీ వీలైతే పాటించాలి లేకుంటే లేదు. అయితే దీపం పెట్టడం ఒక నియమం మాత్రం తప్పనిసరిగా పాటించాలి. ఎక్కడైనా పెద్ద పెద్ద ఉత్సవాలు జరిగే చోట కానీ.. కొన్ని కార్యక్రమాల్లో కానీ దీప ప్రజ్వలన చేస్తుంటారు. దీనిలో భాగంగా పెద్ద పెద్ద ఒత్తులు వేసి వచ్చిన అతిథులకు ఒక కొవ్వొత్తి ఇచ్చి వాటితో వెలిగించమంటారు. ఇది చాలా దోష భూయిష్టమైన పని అని పండితులు చెబుతారు. కారణమేంటంటే.. కొవ్వొత్తి అనే పదంలోనే కొవ్వు అనేది ఉంది కదా.

కొవ్వు అంటే అర్థం తెలుసు కదా. కొవ్వు మధ్య ఒక వొత్తి పెట్టి చేసే దానితో దేవతల కోసం దీపాలను ఎలా వెలిగిస్తాం? అటువంటి కొవ్వుతో చేసే ఒత్తి శుభకార్యానికి ఎలా పనికొస్తుంది? పూర్వం ఏక హారతిని వెలిగించేవారు. ఇంట్లో కూడా ఏక హారతి ఇస్తూ ఉంటాం. దానితో మాత్రమే దీపాన్ని వెలిగించాలి. పెద్ద దీపపు సిమ్మె కొనగలిగలిగే స్తోమత ఉన్నవారు సైతం దానిని వెలిగించేందుకు సైతం ఏకహారతిని వెలిగించే దానితోనే దీపాలను వెలిగించాలి. ఒకవేళ ఇలా చేయడం వీలుకాని వారు అగ్గిపుల్లతో కానీ అగరుబత్తితో కానీ వెలిగించవచ్చు. అంతేకానీ కొవ్వొత్తితో దీపం వెలిగించడం ఏమాత్రం మంచిది కాదని పండితులు చెబుతున్నారు.

Share this post with your friends