భద్రాచలంలో శ్రీ సీతారాముల కల్యాణ మహోత్సవానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. భద్రాచలమంతా విద్యుద్దీప కాంతులతో మిరుమిట్లు గొలుపుతోంది. అయితే భద్రాలచ క్షేత్రానికి మరో క్షేత్రంతో సారూప్యత ఉంది అదేంటో చూద్దాం. శ్రీరంగం క్షేత్రంతో భద్రాచల క్షేత్రానికి సారూపక్యత ఉంది. శ్రీరంగం అనగానే రామానుజాచార్యుల వారి విశిష్టాద్వైతం గుర్తుకు వస్తుంది. అప్పట్లో శ్రీరంగం కేంద్రంగా రామానుజాచార్యుల వారు విశిష్టాద్వైతాన్ని విశ్వవ్యాప్తం చేశారు.
మరి ఎక్కడో ఉన్న శ్రీరంగం క్షేత్రానికి భద్రాచలంతో సారూప్యత ఏంటంటారా? భగవత్ రామానుజముద్రను భక్త రామదాసు భద్రాచలం తీసుకొచ్చారు. అంతేకాకుండా శ్రీరంగం నుంచి పంచరాత్ర ఆగమ సిద్దాంతాలు తెలిసిన ఐదు కుటుంబాలను భద్రాద్రికి తీసుకొచ్చి శ్రీరంగం ఆలయ వ్యవస్థను యథాతథంగా రామదాసు స్థాపించారు. శ్రీరంగనాథుడిని ఎత్తైన కొండపై శ్రీరంగంలో మాదిరిగానే దక్షిణాభిముఖంగా ఇక్కడ ప్రతిష్టించారు. ఆ కొండను ఇప్పటికీ రంగనాయకుల గుట్ట అని పిలుస్తుంటారు.అలాగే లక్ష్మీతాయారు సన్నిధిని సైతం రంగనాథుని గర్భగుడి ఎదురుగా ఉంది.