క్యూ లైన్లలో ఎలాంటి తొక్కిసలాట జరగకుండా టీటీడీ విజిలెన్స్, పోలీసు సిబ్బంది పటిష్ట బందోబస్తు నిర్వహిస్తున్నారు. శనివారం సాయంత్రం 5 గంటల వరకు 46,486 మంది యాత్రికులు శ్రీవేంకటేశ్వర స్వామి దర్శనం చేసుకున్నారు.
భక్తుల అధిక రద్దీ కారణంగా జూన్ 30వ తేదీ వరకు శుక్ర, శని, ఆదివారాల్లో విఐపి బ్రేక్ దర్శనాలను టీటీడీ రద్ధు చేసింది. టీటీడీ ఈవో శ్రీ ఏవి ధర్మారెడ్డి ఆదేశాల మేరకు ఇంజినీరింగ్, ఆరోగ్యం, అన్నప్రసాదం, విజిలెన్స్, వైద్య శాఖల ఉన్నతాధికారులు భక్తుల సౌకర్యాలను, క్యూ లైన్లను నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.