ద్వారకా తిరుమల చిన వెంకన్న ఆలయంలో బ్రహ్మోత్సవాలు 3 వ రోజుకు చేరుకున్నాయి. యోగ శ్రీనివాసుడు అలంకరణలో భక్తులకు చిన వెంకన్న దర్శనమిస్తున్నారు. ఉదయం సూర్యప్రభ వాహనంపై స్వామివారి ఊరేగింపు వైభవంగా జరిగింది. రాత్రి 7 గంటలకు చంద్రప్రభ వాహనంపై స్వామివారి తిరువీధి సేవ జరగనుంది. ఆలయ ముఖ మండపంలో స్వామివారు రోజుకో ప్రత్యేక అలంకరణలో భక్తులకు కనువిందు చేస్తున్నారు. ఈ నెల 25న ద్వాదశ కోవెల ప్రదక్షిణలు, శ్రీపుష్పయాగం – పవళింపుసేవతో శ్రీవారి బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి.
ద్వారకాతిరుమల చిన వెంకన్న ఆలయంలో వైశాఖ మాస దివ్య బ్రహ్మోత్సవాలు ఇవాళ వైభవంగా ప్రారంభమయ్యాయి. ఉదయం స్వామి, అమ్మవార్లను పెండ్లి కొడుకు, పెండ్లి కూతురుగా అలంకరించడంతో ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. రాత్రి 7 గంటలకు గజ వాహనంపై స్వామివారి గ్రామోత్సవం నిర్వహించనున్నారు. ఈ నెల 25 వరకూ బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. బ్రహ్మోత్సవాల సమయంలో ఆలయంలో స్వామి వారికి జరిగే నిత్య కళ్యాణాలు, ఆర్జిత సేవలను అధికారులు రద్దు చేశారు. ఉత్సవాలు జరిగినన్ని రోజుల పాటు ఉదయం, సాయంత్రం గ్రామోత్సవాలను ఆలయ సిబ్బంది నిర్వహించనుంది.