ఇంట్లో పూజ చేసేటప్పుడు గంట కొట్టవచ్చా?

దేవాలయంలో పూజ చేసేటప్పుడు తప్పక గంట కొడతారు. కానీ ఇంట్లో పూజ చేసేటప్పుడు గంట కొట్టొచ్చా? అనే సందేహం ఉంటుంది. కొందరు ఇలాంటి మాటలు చెబుతూ ఉంటారు. ఇంట్లో గంట కొట్టకూడదు అనేది ప్రమాణమైతే..ఏక హారతితో పాటు జంటగా చిన్న గంటను ఎందుకు అమ్ముతారు? అనాదిగా మన ఇళ్లలో పూజ చేసే సందర్భంలో అంతా పూర్తయ్యాక భగవంతుడికి ఆనంద కర్పూర నీరాజనం సమర్పయామి అని మంత్రాలు చెబుతూ ఒక చేతితో హారతి ఇస్తూ మరో చేతితో గంట కొడుతూ ఉంటాం.

ఇక సంప్రదాయాన్ని బట్టి శైవుల ఇళ్లలో గంటపై నంది ఉంటుంది. వైష్ణవుల ఇళ్లలో అయితే గరుత్మంతుడు లేదా ఆంజనేయుడు ఉంటాడు. మనకు తెలిసి ఒక శతాబ్ద కాలంగా అలవాటుగా వస్తున్న ఆనవాయితీని ఆపేయాల్సిన అవసరం లేదు. ఆ సంప్రదాయాన్ని హాయిగా కొనసాగించవచ్చని పండితులు చెబుతున్నారు. ప్రాంతీయమైన ఆచారాలు, కుటుంబ ఆచారాలు, వ్యక్తి ఆచారాలు కొన్ని ఉంటాయి. వాటిని చక్కగా పాటించవచ్చు. ఎవరి ఇంట్లో అయితే మంగళ హారతి ఇచ్చేటప్పుడు గంట కొట్టే సంప్రదాయం ఉంటే దానిని చక్కగా పాటించవచ్చని పండితులు చెబుతున్నారు.

Share this post with your friends