ఇంట్లో రెండు కిచెన్లు నిర్మించుకోవచ్చా?

సొంతిల్లు నానా తంటాలు పడి కట్టుకుంటారు. అలా కట్టుకున్నప్పుడు పక్కాగా వాస్తును ఫాలో అవ్వాలి. లేదంటే కొంత ఇబ్బందికర పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ప్రస్తుత తరుణంలో స్థలం లేకనో.. లేదంటే అదొక స్టేటస్ సింబల్‌గానో భావించి అంతా డూప్లెక్స్ ఇల్లు కట్టుకుంటున్నారు. నష్టమేమీ లేదు. ఎవరికి నచ్చినట్టు వారు కట్టుకోవచ్చు. కానీ కొందరు పైన ఒక కిచెన్.. కింద ఒక కిచెన్ అంటూ రెండు వంట గదులు ఏర్పాటు చేసుకుంటున్నారు. మరి వాస్తు ప్రకారం ఇది ఎంత వరకూ కరెక్ట్? రెండు వంట గదులు ఉండొచ్చా? అనే విషయాలను తెలుసుకుందాం.

డూప్లెక్స్ హౌస్ అంటే.. రెండు లివింగ్ యూనిట్లు ఒకదానికొకటి జతచేయబడిన ఒక రకమైన నివాస గృహం. గదులన్నీ పెద్దగా వస్తాయి. చూడటానికి కూడా చాలా బాగుంటుంది. అయితే దీనిలో ఒక వంట గది.. ఒక డైనింగ్ హాల్ ఉంటే ఓకే రెండు ఏర్పాటు చేసుకున్నారా? ఇబ్బందులు తప్పవని వాస్తు శాస్త్రం చెబుతోంది. ఇంట్లో వంట గది వాస్తుకి చాలా ప్రాధాన్యత ఉంటుంది. దీనిని ఎలా పడితే అలా కట్టుకోవడం సరికాదు. ఇంట్లో ఆగ్నేయం లేదా వాయువ్యంలో ఒక కిచెన్ మాత్రమే ఉండాలట. రెండు కట్టుకోవాల్సిందే అంటే మాత్రం ఆగ్నేయంలోనే రెండు గదులు చేసి.. డ్రై కిచెన్‌, వెట్‌ కిచెన్‌ అని వాడుకోవచ్చట. రెండు కిచెన్లు ఉంటే కుటుంబ సభ్యులు అనారోగ్యం పాలవుతారట. కుటుంబ కలహాలు ఏర్పడుతాయట.

Share this post with your friends