దాదాపు గుళ్లు అన్నింటిలోనూ ధ్వజస్తంభం ఉండి తీరుతుంది. ఆలయంలోని ప్రధాన దేవత గర్భగుడి ముందు ధ్వజస్తంభాన్ని ఏర్పాటు చేస్తూ ఉంటారు. అయితే ఈ ధ్వజస్తంభం లేని గుడులు కూడా ఉంటాయా? ఒకవేళ ఉంటే ఆలయంలో ప్రదక్షిణ చేయవచ్చా? అనే విషయాలను తెలుసుకుందాం. ధ్వజస్తంభ ప్రతిష్టాపన ఎంత వైభవంగా చేస్తారో.. ధ్వజస్తంభ ప్రతిష్టాపన కూడా అంతే వైభవంగా నిర్వహిస్తారు. దీన్ని బట్టే ధ్వజస్తంభానికి ఉండే విలువేంటో తెలుసుకోవచ్చు. ధ్వజస్తంభ ప్రతిష్టాపన సమయంలో నవరత్నాలతో పాటు వివిధ రకాల లోహాలను కూడా పెడుతుంటారు.
ఆలయంలో శక్తి ఉంటుంది. ఇక ధ్వజస్తంభం ఉంటే.. ఆలయంలో గర్భగుడితో పాటు ధ్వజస్తంభాన్ని కూడా కలుపుకుని చేయాల్సి ఉంటుంది. కొన్ని ఆలయాల్లో ధ్వజస్తంభం ఉండదు. వాటిని వాయు ప్రతిష్ట అంటారు. ఇటువంటి ఆలయాల్లో నిత్య ధూప దీప నైవేద్యాలు అవసరం లేదట. వీలైనప్పుడు చేయవచ్చు. అటువంటి ఆలయాల్లో ప్రదక్షిణ చేయాలా? అంటే.. ఆత్మ ప్రదక్షిణ చేసినా శక్తి వస్తుంది కదా.. అలాగే మనం ఇంట్లో పెట్టుకునే తులసి చుట్టూ ప్రదక్షిణ చేస్తూ ఉంటాం. మరి ఇక్కడ ధ్వజస్తంభం ఉండదు కదా.. కాబట్టి దేవాలయంలో ధ్వజస్తంభం ఉన్నా లేకున్నా ప్రదక్షిణ చేయవచ్చు. అయితే ప్రదక్షిణ కారణంగా మనకు వచ్చే శక్తిలో ఏమైనా తేడా ఉంటే ఉండొచ్చు కానీ ప్రదక్షిణ చేయడంలో తప్పేమీ లేదని పండితులు చెబుతారు.