తిరుపతిలోని నారాయణవనం శ్రీ పద్మావతి సమేత కల్యాణ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాలు మే 21 నుంచి ప్రారంభం కానున్నాయి. మే నెల 29వ తేదీ వరకూ స్వామివారి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగనున్నాయి. మే 15న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం జరుగనుంది. అనంతరం మే 20న బ్రహ్మోత్సవాలకు అంకురార్పణం నిర్వహించనున్నట్టు తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ప్రతి రోజూ ఉదయం 7.30 నుంచి 9.30 గంటల వరకు.. అలాగే రాత్రి 7 నుంచి 9 గంటల వరకూ వాహనసేవలను నిర్వహించనున్నట్టు టీటీడీ తెలిపింది. మే 28వ తేదీ రాత్రి 8.30 గంటలకు స్వామివారి కల్యాణోత్సవం నిర్వహిస్తారు. రూ.1000/- చెల్లించి గృహస్తులు ఈ కల్యాణోత్సవంలో పాల్గొనవచ్చని ప్రకటించింది. కల్యాణోత్సవంలోల పాల్గొనే గృహస్తులకు ఒక ఉత్తరీయం, ఒక రవికె, ఒక లడ్డు, ఒక వడ, కుంకుమ బహుమానంగా అందజేస్తారు.
బ్రహ్మోత్సవాల్లో వాహనసేవల వివరాలు :
21-05-2024
ఉదయం – ధ్వజారోహణం
రాత్రి – పెద్దశేష వాహనం
22-05-2024
ఉదయం – చిన్నశేష వాహనం
రాత్రి – హంస వాహనం
23-05-2024
ఉదయం – సింహ వాహనం
రాత్రి – ముత్యపుపందిరి వాహనం
24-05-2024
ఉదయం – కల్పవృక్ష వాహనం
రాత్రి – సర్వభూపాల వాహనం
25-05-2024
ఉదయం – మోహినీ అవతారం
రాత్రి – గరుడ వాహనం
26-05-2024
ఉదయం – హనుమంత వాహనం
రాత్రి – గజ వాహనం
27-05-2024
ఉదయం – సూర్యప్రభ వాహనం
రాత్రి – చంద్రప్రభ వాహనం
28-05-2024
ఉదయం – రథోత్సవం
రాత్రి – అశ్వవాహనం, కల్యాణోత్సవం
29-05-2024
ఉదయం – చక్రస్నానం
రాత్రి – ధ్వజావరోహణం