తులసి ఆకుల్ని దిండు కింద పెట్టుకుంటే ఇన్ని ప్రయోజనాలుంటాయా?

హిందువులు అత్యంత పవిత్రంగా భావించే వాటిలో తులసి మొక్క ఒకటి. ప్రతిరోజూ తులసిమొక్కను పూజిస్తే కుటుంబమంతా సుఖ సంతోషాలతో హాయిగా ఉంటుందని నమ్మకం. అందుకే ప్రతి ఒక్కరూ ఇంటి ముందు తులసి మొక్కను పెంచుకుంటారు. తులసి మొక్కతో ఆరోగ్యానికి ఆరోగ్యం.. ఇతర ప్రయోజనాలు కావల్సినన్ని ఉన్నాయి. తులసి ఆకును ప్రతి రోజూ రాత్రి పడుకునే ముందు దిండు కింద పెట్టి పడుకుంటే ప్రయోజనాలు చాలా ఉన్నాయని చెబుతుంటారు. మరి ఆ ప్రయోజనాలేంటో చూద్దాం. దిండు కింద తులసి ఆకును పెట్టుకుంటే నెగిటివిటీ పోయి ఇంట్లో పాజిటివిటీ పెరుగుతుందట.

చెడు ఆలోచనలేవీ మనసులోకి రాకుండా ప్రశాంతంగా ఉంటారట. అలాగే ప్రతిరోజూ తులసి ఆకుల్ని దిండు కింద పెట్టుకుని పడుకోవడం వల్ల మానసిక ఒత్తిడి కూడా చాలా వరకూ తగ్గుతుందట. ఇంకో ప్రయోజనం ఏంటంటే.. చాలా మందికి విపరీతమైన కోపం ఉంటుంది. దిండు కింద తులసి ఆకులు ఉంచడం వలన కోపం పూర్తి తగ్గిపోతుందట. అలాగే మనపై ఎలాంటి దిష్టి దోషాలన్నీ తొలగిపోతాయట. ఇక తులసి ఆకుల్ని ఎర్రటి వస్త్రంలో పెట్టి పిల్లో కింద పెడితే ధన ప్రవాహం ఇంట్లో బాగా పెరుగుతుందట. అంతేకాకుండా ఎక్కడి నుంచి అయినా డబ్బు రావాల్సి ఉన్నా కూడా తప్పక వస్తుందట.

Share this post with your friends