న్యూఢిల్లీలో శ్రీవేంకటేశ్వర స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలను మే 21 నుంచి తిరుమల తిరుపతి దేవస్థానం నిర్వహించనుంది.ఢిల్లీలోని శ్రీవారి ఆలయంలో ఈ వార్షిక బ్రహ్మోత్సవాలు మే 21 నుంచి 29 వరకూ జరుగనున్నాయి. ఈ బ్రహ్మోత్సవాలకు మే 20న సాయంత్రం అంకురార్పణ చేయనున్నారు. ఈ క్రమంలోనే బ్రహ్మోత్సవాల ముందు మే 14న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనంతో అర్చకులు ఆలయ శుద్ధి నిర్వహిస్తారు. ఇక మే 21 నుంచి వివిధ వాహన సేవలు.. ధ్వజారోహణం వంటి కార్యక్రమాలు జరుగనున్నాయి. మే 21 ఉదయం 10.45 నుంచి 11.30 గంటల మధ్య కర్కాటక లగ్నంలో శాస్త్రోక్తంగా ధ్వజారోహణం నిర్వహించనున్నారు. 25న సాయంత్రం స్వామివారికి కల్యాణోత్సవం నిర్వహించనున్నారు.29న ధ్వజారోహణంతో స్వామివారి బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి.
బ్రహ్మోత్సవాల్లో వాహనసేవలు..
21న ధ్వజారోహణం, రాత్రి పెద్దశేష వాహన సేవ
22న చిన్నశేష వాహనం, రాత్రి హంస వాహన సేవ
23న సింహ వాహనంపై రాత్రి ముత్యపుపందిరి వాహనం
24న కల్పవృక్ష వాహనం, రాత్రి సర్వభూపాల వాహనం
25న గరుడ వాహనం
26న హనుమంత వాహనం, రాత్రి గజవాహనానం
27న సూర్యప్రభ వాహనం, రాత్రి చంద్రప్రభ వాహనం
28న రథోత్సవం జరగనుండగా రాత్రి అశ్వ వాహనం