మే 16 నుంచి కీలపట్ల శ్రీ కోనేటిరాయస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు

చిత్తూరు జిల్లా కీలపట్లలోని శ్రీ కోనేటిరాయస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు మే 16 నుంచి నిర్వహించనున్నట్టు తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది. ఈ బ్రహ్మోత్సవాలు ఈ నెల 24వ తేదీతో ముగియనున్నాయి. మే 14న కోయిల్ ఆళ్వార్ తిరుమంజ‌నం, మే 15న సాయంత్రం 6 నుంచి రాత్రి 8.30 గంటలవరకు సేనాధిపతి ఉత్సవం, అంకురార్పణతో బ్రహ్మోత్సవాలు ప్రాంభమవుతాయి. రోజు ఉదయం 8 నుంచి 10 గంటల వరకు, రాత్రి 7 నుంచి 9 గంటల వరకు వాహనసేవలు జరుగుతాయి. ఉత్సవాల్లో భాగంగా మే 20వ తేదీ సాయంత్రం 4 గంటలకు స్వామివారి కల్యాణోత్సవం జరుగనుంది.

వాహనసేవల వివరాలు ఇలా ఉన్నాయి.

16-05-2024
ఉదయం – ధ్వజారోహణం(మిథున‌ లగ్నం)
సాయంత్రం – శేష వాహనం

17-05-2024
ఉదయం – తిరుచ్చిఉత్సవం
సాయంత్రం – హంస వాహనం

18-05-2024
ఉదయం – సింహ వాహనం
సాయంత్రం – ముత్యపుపందిరి వాహనం

19-05-2024
ఉదయం – కల్పవృక్ష వాహనం
సాయంత్రం – సర్వభూపాల వాహనం

20-05-2024
ఉదయం – మోహినీ ఉత్సవం
సాయంత్రం – కల్యాణోత్సవం, గరుడ వాహనం

21-05-2024
ఉదయం – హనుమంత వాహనం
సాయంత్రం – వసంతోత్సవం, గజ వాహనం

22-05-2024
ఉదయం – సూర్యప్రభ వాహనం
సాయంత్రం – చంద్రప్రభ వాహనం

23-05-2024
ఉదయం – రథోత్సవం
సాయంత్రం – అశ్వవాహనం

24-05-2024
ఉదయం – చక్రస్నానం
సాయంత్రం – ధ్వజావరోహణం

Share this post with your friends