శ్రీ రామ నవమికి సర్వాంగ సుందరంగా ముస్తాబైన భద్రాద్రి.. నేడు ఎదుర్కోలు ఉత్సవం..!

భారతదేశంలోనే రెండో అయోధ్యగా పేరుగాంచిన భద్రాచలం.. శ్రీరామనవమి కోసం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. స్వామివారి కల్యాణానికి ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లనూ పూర్తి చేశారు. సీతారాముల కల్యాణం జరగనున్న మిథిలా స్టేడియాన్ని అందంగా ముస్తాబు చేశారు. నేడు భద్రాద్రిలో ఎదుర్కోలు ఉత్సవం నిర్వహించనున్నారు. రామాలయం ఉత్తర ద్వారం వద్ద ఈ ఎదుర్కోలు ఉత్సవం జరగనుంది. ఇక స్వామి వారి కల్యాణం అయిన మరుసటి రోజు అంటే ఈ నెల 18న శ్రీ రామ పట్టాభిషేకం జరగనుంది. ఈ క్రమంలోనే 59 సంవత్సరాల తరువాత భద్రాచలం వద్ద గోదావరి రెండో వారధి ప్రారంభమైంది.

భద్రాద్రి రామయ్య కల్యాణ వేడుకలు ఉగాది నుంచే ప్రారంభమయ్యాయి. అయితే శ్రీరామనవమి సందర్భంగా స్వామివారి కల్యాణాన్ని కన్నులారా తిలకించేందుకు విచ్చేస్తున్న భక్తులకు ఆలయ అధికారులు గుడ్ న్యూస్ చెప్పారు. భక్తులందరూ రేపు ప్రధాన ఆలయంలోని మూలవరులను ఉచితంగా దర్శించుకోవచ్చు. ఈ క్రమంలోనే ఆలయంలో నిత్యం ఉండే ప్రత్యేక అర్చనలు, వంద రూపాయలు దర్శనాలను రేపు నిలిపివేయనుున్నారు. స్వామివారి ఉచిత దర్శన భాగ్యంతో పాటు వివిధ రాష్ట్రాల నుంచి కల్యాణాన్ని తిలకించేందుకు వస్తున్న భక్తులకు నిరంతరాయంగా అన్నదాన సదుపాయాన్ని సైతం కల్పిస్తున్నారు.

Share this post with your friends