అహల్య, గౌతముల వివాహం వెనుక కథేంటి?

అప్సరసల గురించి చెప్పేదేముంది? ఇప్పటికీ అత్యంత సౌందర్యవతులను అప్సరసలతోనే పోలుస్తూ ఉంటాం. ఇంద్రాది దేవలంతా అప్సరసలకు దాసోహమైన వారే. అంతటి సౌందర్యానికి ముగ్దులు కాని వారుంటారా? అంటే కొందరు ఉంటారు. ముఖ్యంగా అత్యంత సౌందర్యవతి అయిన అహల్య గురించి మనకు అంతో ఇంతో తెలుసు. సుగుణాల్లోనూ ఈమె మహారాని అనే చెప్పాలి. అయితే గౌతమ మహర్షికి నిత్యం సేవలందించడంతో పాటు ఆశ్రమ విధులను నిర్వహించడానికి ఒకరి అవసరం వచ్చింది. ఆ సమయంలో ఒక అప్సరసను దీనికి ఏర్పాటు చేశారు. ఆమే అహల్య. అపురూప సౌందర్యరాశి.

అహల్య గౌతమ మహర్షి దగ్గర పని చేసేందుకు ఎటువంటి ప్రతిఫలమూ ఆశించలేదు. ఎంతో నిస్వార్థతతో, నిజాయితీగా నిత్యం గౌతమ మహిర్షికి సేవలను అందిస్తూ ఉండేది. గౌతముడు కూడా అహల్య సౌందర్యానికి ముగ్దుడవలేదు సరికదా అసలు పట్టించుకోకుండా తన పని తాను చేసుకుంటూ పోయేవాడు. ఈ క్రమంలోనే అహల్య నిజాయితీ, నిస్వార్థాన్ని చూసిన దాంతో ఈమె నిజాయితీని గమనించిన బ్రహ్మదేవుడు.. గౌతమునికి అహల్యే తగిన భార్య అని భావిస్తాడు. ఆ వెంటనే గౌతముని ఎదుట బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై గౌతమునికి పెట్టిన పరీక్షలన్నింటిలోనూ గెలిచాడని.. కాబట్టి దానికి ప్రతిఫలంగా అహల్యను భార్యగా ప్రసాదిస్తున్నానని.. మనసుతో స్వీకరించాలని చెప్పాడు. ఆ వెంటనే బ్రహ్మ దగ్గరుండి మరీ వనదేవతలందరి సమక్షంలో అహల్య, గౌతముల వివాహాన్ని జరిపించాడు.

Share this post with your friends