మనం నమ్మినవాళ్లైవరైనా మనల్ని మోసం చేయవచ్చేమో కానీ మనం నమ్మిన ధర్మం మాత్రం మనల్ని మోసం చేయదనేది లోకోక్తి. టైటిల్ చూస్తే కొంచెం ఆశ్చర్యమేయవచ్చు. సృష్టికర్త కుమారుడే ధర్మ. ధర్మానికి భార్యలేంటి? భాగవతం ధర్మానికి అనేక మంది భార్యలున్నారని చెబుతోంది. అవునా.. నిజంగానే ధర్మానికి భార్యలున్నారా? అని ఆలోచించకండి.. ఉపమానంగా.. ధర్మాన్ని సుసంపన్నం చేసే గుణాలున్నాయని చెప్పారు. శ్రాద్ధ అంటే అంకిత భావం.. వారి కుమారుడు శుభ (శుభం). ధర్మం శ్రద్ధతో ముడిపడే ఉంటే ఫలితం శుభం అన్నమాట. ఇక ధర్మానికి ఇతర భార్యలూ అంతే..
ఇక ధర్మం మరో భార్య పేరు మైత్రి.. ప్రసాదకు జన్మనిస్తుంది. మరో భార్య పేరు దయ.. అభయకు జన్మనిచ్చిందట. మరో భార్య పేరు తుష్టి.. ముద అంటే ఆనందానికి జన్మనిచ్చింది. ఇంకో భార్య పేరు తితిక్ష(ప్రతికూలతను అంగీకరించడం).. క్షేమ (భద్రత)కి జ్మనిచ్చింది. మరో భార్య హ్రీహ్ అంటే నమ్రత.. ప్రశ్రయ (అధర్మ పనుల నుంచి దూరంగా ఉండే వ్యక్తి)కు జన్మనిచ్చింది. ఇక సృష్టికర్తకు మరో కుమారుడు కూడా ఉన్నాడు. అతని పేరు అధర్మ. అధర్మకు సైతం కుటుంబం ఉంది. అధర్మ భార్య పేరు మృషా అంటే అబద్ధం. వారికి వంచన అనే కుమారుడు.. మోసం అనే కుమార్తె ఉన్నారు.