శ్రీకృష్ణుడిని కొలిచిన మహర్షులు ఎంతో మంది ఉన్నారు. ఆయన లీలలకు అంతమనేదే లేదు. ఎంత విన్నా కూడా ఇంకా వినాలని అనిపిస్తూనే ఉంటుంది. తన నామస్మరణ చేసిన వారికి అలాగే తన కీర్తనలతో కాలం గడిపిన వారికి.. తననే నమ్ముకున్న మహర్షులను స్వామి ఎప్పుడూ అనుగ్రహిస్తూ వచ్చేవారు. అలా వశిష్ట మహర్షి ఎదుట ఒకసారి అకస్మాత్తుగా ప్రత్యక్షమై ఆశ్చర్యాన్ని కలిగించారట. అక్కడ అనంతరం స్వామివారికి గుడి కూడా కట్టారు. అదే తిరుక్కణ్ణం గుడి. తమిళనాడులోని నాగపట్నం సమీపంలో ఉంది.
తిరుక్కణ్ణం గుడినే కృష్ణారణ్య క్షేత్రం అని కూడా అంటారు. 108 దివ్య తిరుపతులలో దీనిని కూడా ఒకటిగా భావిస్తుంటారు. ఒకసారి వశిష్ట మహర్షి తన చేతిలోని వెన్నతో శ్రీకృష్ణుడి ప్రతిమను తయారు చేసి ఆరాధించారట. అంతే స్వామివారు ప్రత్యక్ష్యమయ్యారట. వశిష్ట మహర్షిని ఆలింగనం చేసుకున్నారట. వశిష్ణుడు ఆనందపారవశ్యంలో మునిగి తేలారట. తిరుమంగై ఆళ్వార్ ఈ క్షేత్రాన్ని ఎంతగానో కీర్తించారు. అయితే స్వామివారు ఇక్కడ ప్రత్యక్షంగా వెలిశాడు అనడానికి ఎన్నో నిదర్శనాలు అయితే కనిపిస్తాయి.