Mukkoti Ekadasi Importance : ముక్కోటి ఏకాదశిని సౌరమానం ప్రకారం ఎందుకు జరుపుకుంటారో తెలుసా?

ముక్కోటి ఏకాదశి, లేదా వైకుంఠ ఏకాదశిని ధనుర్మాసంలో వచ్చే శుక్ల పక్ష ఏకాదశి రోజు జరుపుకుంటారు. సాధారణ ఏకాదశులు చాంద్రమానం ఆధారంగా ఉంటాయి. కానీ ముక్కోటి ఏకాదశి సౌరమానం ప్రకారం ప్రత్యేకంగా జరుపుకోవడం విశేషం. సూర్యభగవానుడు ధనుస్సు రాశిలో ప్రవేశించిన ధనుర్మాసంలో ఈ పవిత్రదినం భక్తుల జీవనానికి మహత్తర అనుగ్రహాన్ని ఇస్తుందని చెబుతారు. ఈ రోజు, ముక్కోటి దేవతలు వైకుంఠానికి చేరి ఉత్తర ద్వారం ద్వారా శ్రీమహావిష్ణువును దర్శిస్తారని విశ్వాసం ఉంది. ఈ సంప్రదాయం ఆలయాల్లో కూడా కొనసాగుతుంది. ఉత్తర ద్వారం వద్ద ప్రత్యేక రత్న మందిరాలు నిర్మించి భక్తులు స్వామిని దర్శిస్తారు. ఈ ఉత్తర ద్వార దర్శనం వలన మోక్షం పొందుతారని, జన్మ పునీతమవుతుందని భక్తులు నమ్ముతారు.

 Mukkoti Ekadasi 2025
Mukkoti Ekadasi 2025
Share this post with your friends