కార్తిక శుక్ల ఏకాదశిని ప్రబోధిని ఏకాదశి లేదా ఉత్థాన ఏకాదశి అని పిలుస్తారు. దీనికి ప్రధాన కారణం, ఆషాఢ శుక్ల ఏకాదశి నాడు యోగనిద్రలోకి వెళ్లిన శ్రీ మహావిష్ణువు, కార్తిక శుక్ల ఏకాదశి రోజున మేల్కొంటాడని పురాణాలు చెబుతాయి. ఈ పవిత్రమైన రోజున ఆచరించే ముఖ్యమైన విషయాలు మరియు దాని ప్రాముఖ్యత గురించి ఇప్పుడు తెలుసుకుందాం..!

ఈ ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణువు, తులసి మొక్కను వివాహం చేసుకుంటాడు. ఈ వేడుకను తులసి కల్యాణం అని కూడా అంటారు. ఈ రోజున శ్రీ మహావిష్ణువును ప్రత్యేకంగా పూజించడం వల్ల సకల పాపాలు తొలగిపోయి, కోరిన కోరికలు నెరవేరుతాయని భక్తులు నమ్ముతారు.
ఈ ఏకాదశి రోజున ఉపవాసం ఉండటం, రాత్రి జాగరణ చేసి విష్ణువును స్మరించుకోవడం వల్ల ఎంతో పుణ్యం లభిస్తుంది. కార్తిక శుక్ల ఏకాదశి అనేది విష్ణువు యోగనిద్ర నుండి మేల్కొని, సృష్టి నిర్వహణ బాధ్యతలను తిరిగి స్వీకరించే శుభదినం. ఈ రోజున చేసే పూజలు, వ్రతాలు అత్యంత పవిత్రమైనవిగా భావిస్తారు.
ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా భక్తి టీవీ యూట్యూబ్ ఛానల్ ను Subscribe చేయండి.
