శ్రీ రామానుజాచార్యుల అవతార మహోత్సవాలు ప్రారంభం

శ్రీ రామానుజాచార్యుల అవతార మహోత్సవాలు తిరుపతిలోని అన్నమాచార్య మహోత్సవాలు ప్రారంభమయ్యాయి. టీటీడీ ఆళ్వార్‌ దివ్యప్రబంధ ప్రాజెక్టు ఆధ్వర్యంలో తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో శ్రీ రామానుజాచార్యుల అవతార మహోత్సవాలు శుక్రవారం సాయంత్రం ఘనంగా ప్రారంభమయ్యాయి. భ‌గ‌వంతుడు అంద‌రివాడ‌ని భ‌గ‌వ‌ద్ రామానుజాచార్యులు ఉద్బోధించార‌ని, ప్ర‌స్తుత స‌మాజంలో అంద‌రూ దీన్ని పాటించాల‌ని టిటిడి తిరుమల శ్రీ‌శ్రీ‌శ్రీ చిన్న‌జీయ‌ర్ స్వామి ఉద్ఘాటించారు. మే 12వ తేదీ వరకూ మూడు రోజుల పాటు ఈ ఉత్సవాలు జరుగనున్నాయి.

ఈ సంద‌ర్భంగా శ్రీ‌శ్రీ‌శ్రీ చిన్న‌జీయ‌ర్ స్వామి అనుగ్ర‌హ భాష‌ణం చేస్తూ ఆదిశేషుని అవతారమైన భగవద్‌ రామానుజులు శరణాగత భక్తిని విశేషంగా ప్రచారం చేశారని, శ‌ర‌ణాగ‌తి భ‌క్తితో భ‌గ‌వంతుని కొలిస్తే దివ్య‌త్వం క‌లుగుతుంద‌ని అన్నారు. శ్రీమహావిష్ణువుకు ఆదిశేషుడు పాన్పుగా, ఆసనంగా ఉంటూ ప్రథమ సేవకుడిగా నిలిచాడని, భగవద్‌ రామానుజులు ఈ మార్గాన్నే అనుసరించారని వివరించారు. శ్రీ రామానుజార్యుల అవతార మహోత్సవాలను తిరుమల తిరుపతి దేవస్థానం ఘ‌నంగా నిర్వహిస్తోంద‌న్నారు.

Share this post with your friends