సప్తగిరుల్లో భక్తుల రద్దీ కొనసాగుతోంది. వారాంతం కావడంతో వివిధ ప్రాంతాలనుంచి భారీసంఖ్యలో భక్తులు తరలివచ్చారు. దీంతో అన్ని కంపార్ట్ మెంట్లు నిండిపోయి క్యూలైన్ సేవా సదన్ వరకు వచ్చింది. టోకెన్ లేని భక్తులకు సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతోంది. దీంతో తితిదే భక్తులకు అవసరమయిన ఏర్పాట్లు చేసింది. 34 వేల 245 మంది భక్తులు శ్రీవారికి తలనీలాలు సమర్పించుకున్నారు.
2024-03-30