సప్తగిరుల్లో భక్తుల రద్దీ కొనసాగుతూనే ఉంది. వారాంతం కావడంతోపాటు పదో తరగతి పరీక్షలు కూడా ముగియడంతో వివిధ ప్రాంతాలనుంచి భారీసంఖ్యలో భక్తులు తరలివచ్చారు. దీంతో వైకుంఠం క్యూకాంప్లెక్సులోని 31 కంపార్ట్ మెంట్లు నిండిపోయి ఆలయం వెలుపల కూడా భక్తులు బారులుతీరారు. టోకెన్ లేని భక్తులకు సర్వదర్శనానికి 24 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 5 గంటల సమయం పడుతోంది. దీంతో తితిదే అధికారులు భక్తులకు అవసరమయిన ఏర్పాట్లు చేశారు.
2024-03-31