నెల్లూరు రంగనాయకులపేటలోని తల్పగిరి రంగనాథస్వామివారి రథోత్సవం వైభవంగా జరిగింది. అశేష భక్తజనం నడుమ గోవింద నామస్మరణలతో జరిగిన రంగనాథుడి రథోత్సవం నేత్రపర్వంగా సాగింది. శ్రీదేవి, భూదేవి సమేతంగా కొలువుదీరిన స్వామివారు అభయముద్రలో భక్తులకు దర్శనమిచ్చారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారికి రథోత్సవం నిర్వహించారు. దీన్ని తిలకించేందుకు వేలమంది భక్తులు తరలిరావడంతో వీధులు కిక్కిరిశాయి. స్వామివారికి టెంకాయలు కొట్టి కర్పూర హారతులిచ్చారు. జిల్లాలోని వివిధ ప్రాంతాలతో పాటు తమిళనాడు, కర్ణాటక నుంచి తరలివచ్చిన భక్తులు రథోత్సవంలో పాల్గొన్నారు.
2024-03-27