టిటిడిని అభినందించిన భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి

భారత సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డాక్టర్‌ డివై చంద్రచూడ్‌ గారు మార్చి 27వ తేదీన ఎస్వీ వేద విశ్వవిద్యాలయాన్ని సందర్శించారు. అత్యంత పురాతనమైన తాళపత్ర గ్రంథాలను ఇక్కడ డిజిటలైజ్‌ చేసి భద్ర పరుస్తున్న విధానాన్ని ఆయన అభినందించారు. భావితరాలకు సనాతన భారతీయ విజ్ఞానాన్ని అందించేందుకు తాళపత్రాలలోని విజ్ఞానాన్ని ప్రచురించడానికి టిటిడి చేస్తున్న కృషిని ఆయన అభినందించారు. ఈ కార్య‌క్ర‌మంలో జేఈవో శ్రీ వీర‌బ్ర‌హ్మం, ఎస్వీబిసి సిఈవో శ్రీ ష‌ణ్ముఖ‌కుమార్‌, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Share this post with your friends