శ్రీ నాగులమ్మ ఆలయంలో సుంకు పండుగ

ములుగు జిల్లా మంగపేట మండలం వాగొడ్డుగూడెంలో శ్రీ నాగులమ్మ ఆలయంలో సుంకు పండుగ ఘనంగా జరిగింది. నాగులమ్మ మణి రూపంలో కొలువుదీరిన గండోర్రే గుట్ట ప్రాంతానికి చేరుకున్న పూజారులు అమ్మవారి గుహను అలంకరించి పూజలు చేశారు.అనంతరం పాలయిగూడెం వద్ద ఉన్న గోదావరి నదికి డోలు వాయిద్యాల నడుమ శ్రీ నాగులమ్మ అమ్మవారి ఏల్పుల జెండాలను తీసుకెళ్లారు. వివిధ పుష్పాలతో, పత్రాలతో పూజారులు పూజించారు. అనంతరం ఏల్పుల జెండాలను ఊరేగింపుగా తీసుకొచ్చి నాగులమ్మ ఆలయంలో ప్రతిష్టించారు.

Share this post with your friends