నవ నరసింహ క్షేత్రాలలో ఒకటైన ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహస్వామి వార్ల బ్రహ్మోత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీ యోగ నరసింహుని ఏకాంతోత్సవం కన్నుల పండుగగా జరిగింది. స్వామి అమ్మవార్లను అందంగా అలంకరించి… ఆలయం చుట్టూ పల్లకీ సేవ గావించారు. ఈ సందర్భంగా చిన్నారులు చేసిన నృత్యాలు అందరినీ ఆకట్టుకున్నాయి. వేలాదిమంది భక్తులు పల్లకీ సేవలో పాల్గొన్నారు. అనంతరం స్వామి, అమ్మవార్ల పవళింపు జరిగింది.
బ్రహ్మోత్సవాల సందర్భంగా నవ నరసింహ క్షేత్రాలలో ఒకటైన ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానానికి భారీ రాబడి వచ్చింది. 14 రోజుల వ్యవధిలో 30 లక్షల 64 వేల 396 రూపాయల మేర ఆదాయం సమకూరింది. దీంతోపాటు 57 గ్రాముల మిశ్రమ బంగారం, 5 కిలోల 200 గ్రాముల వెండి కానుకలను భక్తులు సమర్పించారు. లెక్కింపు ప్రక్రియలో భక్తులు, అర్చకులు, అధికారులు పాల్గొన్నారు.