టీటీడీ ఆధ్వ‌ర్యంలో శ్రీ క్రోధి నామ సంవత్సర పంచాంగం

తిరుపతి టిటిడి పరిపాలనా భవనంలోని మీటింగ్ హాల్‌లో శుక్రవారం డయల్ యువర్ ఈవో కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఈవో భక్తులను ఉద్దేశించి ప్రసంగించారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

✦ శ్రీవారి భక్తులకు, దాతలకు, అర్చకులకు, టిటిడి సిబ్బందికి, శ్రీవారి సేవకులకు శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు.

✦ ఏప్రిల్‌ 9వ తేదీన తిరుమల శ్రీవారి ఆలయంలో శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది పర్వదినాన్ని ఘనంగా నిర్వహిస్తాం. ఈ సందర్భంగా టిటిడి ఆస్థాన పండితులు ఆస్థానం, పంచాంగశ్రవణం నిర్వహిస్తారు. ఇందులో దేశకాల, ఋతు పరిస్థితులను, నక్షత్ర, రాశి, వారఫలాలను పండితులు తెలియజేస్తారు.

✦ శ్రీ క్రోధి నామ సంవత్సర పంచాంగాన్ని భక్తులందరూ కొనుగోలు చేసేందుకు వీలుగా ఇప్పటికే తిరుమల, తిరుపతిలోని టిటిడి బుక్‌స్టాళ్లలో అందుబాటులో ఉంచాం.

✦ హైదరాబాద్‌, విశాఖపట్నం, విజయవాడ, చెన్నై, బెంగళూరులోని టిటిడి సమాచార కేంద్రాల్లోనూ పంచాంగం అందుబాటులో ఉంది.

Share this post with your friends