తిరుమల శ్రీవారి ఆలయానికి వైజాగ్ కు చెందిన భక్తుడొకరు పెద్ద మొత్తంలో విరాళాన్ని అందజేశారు. మైత్రి ఇన్ ఫ్రాస్ట్రక్చర్ అండ్ మైనింగ్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ చైర్మన్ శ్రీ శ్రీనివాస రావు శనివారం శ్రీ వేంకటేశ్వర అన్న ప్రసాదం ట్రస్టుకు రూ.కోటి విరాళంగా అందించారు. ఈ మేరకు తిరుమలలోని టీటీడీ చైర్మన్ క్యాంపు కార్యాలయంలో చైర్మన్ శ్రీ బీ.ఆర్.నాయుడుకు విరాళం డీడీని అందజేశారు. శనివారం తిరుమల టీటీడీ ఛైర్మన్ కార్యాలయంలో ఛైర్మన్ బీఆర్ నాయుడును కలిసి విరాళానికి సంబంధించిన డీడీని శ్రీనివాసరావు అందించారు.
కాగా.. తిరుమలలో అపచారం చోటు చేసుకుంది. ఇద్దరు వ్యక్తులు పాదరక్షలతో ఆలయంలోకి ప్రవేశించారు. వారిని మహాద్వారం వద్ద భద్రతా సిబ్బంది పట్టుకోవడంతో తీవ్ర కలకలం రేగింది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ నుంచి స్వామివారి దర్శనానికి పాదరక్షలతో ఇద్దరు భక్తులు వచ్చారు. మూడు ప్రాంతాల్లో తనిఖీలు జరిగినా కూడా సిబ్బంది దీనిని గుర్తించలేదు. దీనిపై సామాన్య భక్తులు సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.