అభిజిత్ లఘ్నంలో కన్నుల పండువగా భద్రాద్రి రామయ్య కల్యాణం..

కల్యాణం.. కమనీయం.. మూడు ముళ్ల.. ముచ్చటైన వేడుక భద్రాద్రి రామయ్య కల్యాణం. అంగరంగ వైభవంగా మిథిలా స్టేడియంలో జరిగింది. ఇసుకేస్తే రాలనంత భక్త జన సందోహం నడుమ సీతారాముల వివాహ మహోత్సవం జరిగింది. రాష్ట్రాల నుంచి భద్రాద్రి రామయ్య కల్యాణాన్ని కన్నులారా వీక్షించేందుకు తరలివెళ్లింది. అలా వెళ్లలేని వారంతా టీవీలకు అంకితమయ్యారు. సీతారాముల వారి కల్యాణ దృశ్యాన్ని కళ్ల నిండా నింపుకున్నారు. ఉగాది పర్వదినం నుంచే భద్రాద్రి రామయ్య కల్యాణ వేడుకలు ప్రారంభమయ్యాయి. భద్రాద్రి మొత్తం అందంగా ముస్తాబైంది.

ఇక ఇవాళ ఉదయమే మొదట కల్యాణం రామాలయంలో మూలవరులకు జరిగింది అనంతరం . ఆ తరువాత శంఖ, చక్ర, ధనుర్బాణాలను ధరించి సీతతో కూడిన శ్రీరాముడి ఉత్సవ విగ్రహాలను ఆలయం నుంచి పల్లకిలో మంగళ వాయిద్యాల నడుమ ఆలయం నుంచి మిథిలా స్టేడియానికి వచ్చారు. ఇక అక్కడి నుంచి కల్యాణ క్రతువు ప్రారంభమైంది. విష్వక్సేన పూజ, పుణ్యాహవచనం నిర్వహించి సీతమ్మను రాములవారికి ఎదురుగా కూర్చోబెట్టారు. సీతారాముల వంశ గోత్రాల ప్రవరల అనంతరం ప్రత్యేకంగా తయారు చేసిన వస్త్రాలను సీతారాములకు ధరింపజేశారు. సీతమ్మకు చింతాకు పతకం.. రామయ్యకు పచ్చల హారం.. లక్ష్మణుడికి రామమాడ ధరింపజేశారు. అనంతరం అభిజిత్ లగ్నంలో సీతారాములతో జీలకర్ర బెల్లం పెట్టించారు. అనంతరం సీతమ్మ మెడలో మూడు సూత్రాలున్న తాళిబొట్టును కట్టించి ఆద్యంతం కన్నుల పండువగా వివాహ మహోత్సవాన్ని జరిపించారు.

Share this post with your friends