కర్నూలు జిల్లా కోడుమూరులో ద్వాదశ జ్యోతిర్లింగాల మెట్ల పూజ ఘనంగా జరిగింది. అరటి బోదెలతో నిర్మించిన శివమంటపంలో శివుణ్ణి లింగరూపంలో ఉంచి ద్వాదశ మెట్లను ఏర్పాటు చేసి వాటిపై వేదమంత్రోచ్ఛారణల నడుమ జ్యోతి ప్రజ్వలన చేశారు. ఈ ఆలయ ప్రాంగణంలో అన్నదాన క్రతువును ప్రారంభించి 22 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కర్నాటక బాదనహళ్ళి మఠం పీఠాధిపతి కరి బసవస్వామి పాల్గొన్నారు.
2024-03-31