కదిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆదిశేషుడిపై భక్తులకు దర్శనమిచ్చారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా శేషవాహన ఉత్సవాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. వేడుకల్లో భాగంగా శ్రీదేవి, భూదేవి సమేత వసంత వల్లభులకు ప్రత్యేక అలంకరణ చేశారు. శ్రీవారికి ఆలయ అర్చకులు విశేష పూజలతో ఉత్సవాన్ని జరిపారు. స్వామి వారిని దర్శించుకునేందుకు భక్తులు ఆలయానికి చేరుకున్నారు. శేష వాహనం ముందు నిర్వహించిన పలు సాంస్కృతిక, జానపద, నృత్య ప్రదర్శన అందరినీ ఆకట్టుకున్నాయి. భక్తుల గోవిందనామ స్మరణతో ఆలయ ప్రాంగణం, పురవీధులు మార్మోగాయి. నారసింహుని దర్శించుకున్న భక్తులు ఫల, పుష్ప, కాయ, కర్పూరాలను సమర్పించారు.
2024-03-27