తిరుమల ఏడుకొండలలోని చివరి నాలుగు కొండల గురించి తెలుసా?

తిరుమలలో ఏడు కొండలున్నాయి. వాటిని దాటుకుని వెళితే కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని చూడవచ్చు. చివరి నాలుగు కొండలను అంజనాద్రి, శేషాద్రి, వెంకటాద్రి, నారాయణాద్రి అని పిలుస్తారు. ఇక ఈ నాలుగు కొండల గురించి తెలుసుకుందాం.

4. అంజనాద్రి: త్రేతాయుగంలో అంజనాదేవి పుత్ర సంతానం కోసం మాతంగ మహర్షి సలహా మేరకు ఆకాశగంగ సమీపంలో పన్నెండు సంవత్సరాలు తపస్సు చేసింది. అప్పుడు ఆమెకు వాయుదేవుని వరప్రసాదంగా హనుమంతుడు జన్మించాడు. అంజనాదేవి తపమాచరించిన పర్వతం కాబట్టే ఆ కొండకు అంజనాద్రి అనే పేరు వచ్చింది.

5. శేషాద్రి: విష్ణుమూర్తి ఆదేశానుసారం భూలోకంలో స్వామి విహారం కోసం శేషుడు పర్వత రూపం ధరించాడట. అందుకే ఈ కొండకు శేషాద్రి అనే పేరు వచ్చింది.

6. వెంకటాద్రి: “వేం”కారానికి అమృతమని అర్థం “కటం” అంటే ఐశ్వర్యం.. నమ్మి కొలిచేవారికి అమృతాన్ని ఐశ్వర్యాన్ని ప్రసాదించే కొండే వెంకటాద్రి. అలాగే పాపాలను దహించే కొండ కాబట్టి ఈ కొండకు వెంకటాద్రి అనే పేరు వచ్చిందని కూడా అంటారు.

7. నారాయణాద్రి: సాక్షాత్తు నారాయణుడే నివసించడం వల్ల ఈ కొండకు నారాయణాద్రి అనే పేరు వచ్చింది. అంతేకాకుండా శ్రీమన్నారాయణుడు మొట్టమొదట ఈ గిరి మీద పాదాలు మోపడం వల్ల కూడా ఈ కొండకు ఈ పేరు వచ్చిందని చెబుతారు.

Share this post with your friends