కల్పవృక్ష వాహన సేవలో ఆక‌ట్టుకున్న క‌ళా బృందాల ప్ర‌ద‌ర్శ‌న‌

శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో నాలుగో రోజైన శుక్ర‌వారం ఉద‌యం కల్పవృక్ష వాహనసేవలో వివిధ ప్రాంతాల‌ నుంచి విచ్చేసిన కళాబృందాలు అద్భుత‌ ప్రదర్శనలిచ్చారు. శ్రీనివాసమంగపురం శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి వారి బ్రహ్మోత్సవాల్లో నాలుగో రోజైన శుక్ర‌వారం ఉదయం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీనివాసుడు.. శ్రీ రాజగోపాలస్వామివారి అలంకారంలో చంద్రకోలు, దండం ధరించి కల్పవృక్ష వాహనంపై భక్తులను కటాక్షించారు. కాగా సాయంత్రం 5 నుండి 6 గంటల వరకు ఊంజల్‌సేవ వైభవంగా జరిగింది. నిన్న రాత్రి సర్వభూపాల వాహనంపై స్వామివారు భక్తులకు దర్శనమిచ్చారు.

తిరుమల తిరుపతి దేవస్థానం హిందూ ధార్మిక ప్రాజెక్టుల ఆధ్వ‌ర్యంలో 6 కళాబృందాలు, 80 మంది కళాకారులు పాల్గొని తమ సంగీత నృత్య ప్రదర్శనలతో భక్తులను పరవసింప చేశారు. తాడిప‌త్రికి చెందిన వంద‌న డ్యాన్స్ అకాడ‌మికి చెందిన 22 మంది చిన్న‌రులు కూచిపూడి నృత్యాన్ని, తిరుప‌తికి చెందిన సేవా కుటుంబం బృందంలోని 23 మంది మ‌హిళ‌లు, వైభ‌వ వేంక‌టేశ్వ‌ర కోలాట బృందంలోని 16 మంది మ‌హిళ‌ల కోలాట నృత్యం నయనానందకరంగా సాగింది. పాల‌కొల్లు వెంక‌ట వోనిల‌మ్మ భ‌జ‌న బృందంకు 30 మంది క‌ళాకారులు, పైడిప‌ల్లికి చెందిన శ్రీ కృష్ణ‌కోలాట బృందం కోలాటం ప్రదర్శించిన కోలాటం ఆకట్టుకుంది.

Share this post with your friends