సంతానం లేని మహిళలు ఈ అమ్మవారిని పాలతో అభిషేకిస్తే చాలట…

ఒక్కో ఆలయానికి ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. అంబాలాలోని కాళీ దుఖ భంజని ఆలయానికి కూడా ఒక ప్రత్యేకత ఉంది. ఈ ఆలయంలో కాళికాదేవి అమ్మవారు కొలువయ్యారు. ఈ అమ్మవారికి ముఖ్యంగా చిత్ర నవరాత్రుల్లో పాలతో అభిషేకం చేస్తారు. భారతదేశంలో ఇలా అమ్మవారిని పాలతో స్నానం చేయించే దేవలయాలు రెండు మాత్రమే ఉన్నాయి. ఈ రెండు దేవాలయాల్లోనూ ఉత్తరప్రదేశ్‌లోని అంబాలా నగరంలోని కాళీ దుఖ భంజని ఆలయం ప్రసిద్ధి చెందింది. ముఖ్యంగా సంతానం లేని మహిళలు ఇక్కడ ఉన్న అమ్మవారికి పాలతో స్నానం చేయిస్తే ఆ తల్లి దీవెనలు లభిస్తాయని నమ్ముతారు.

అంబాలాలోని కాళీ దుఖ భంజని ఆలయంలో కాళికాదేవిని చిత్ర నవరాత్రుల్లో పాలతో అభిషేకం చేస్తారు. ఇలా అమ్మవారికి పాలతో అభిషేకం చేయడానికి ఉదయం నుంచి భక్తులు ఆలయానికి బారులు తీరతారు. ఇలా నవరాత్రులలో అమ్మవారిని పాలతో స్నానం చేసే దేవాలయాలు భారతదేశంలో రెండు మాత్రమే ఉన్నాయని చెబుతారు. ఈ దేవాలయాలలో అంబాలా నగరంలో కాళీ దుఖ భంజని ఆలయం ప్రసిద్ధి చెందింది. సంతానం లేని మహిళలు.. శుద్ధిగా స్నానమాచరించి అనంతరం అమ్మవారికి పాలతో స్నానం చేయించడంతో పాటు పాలు, పండ్లు సమర్పించాలి. ఇలా చేస్తే తప్పక సంతానం కలుగుతుందని నమ్మకం.

Share this post with your friends