శాపానికి ఉపశమనంగా హనుమంతుడు జన్మించాడట..

హిందూ దేవుళ్లలో హనుమంతుడికి ప్రత్యేక స్థానముంది. ఆయనను అంజనీ పుత్రుడని, వాయు పుత్రుడని, ఆంజనేయుడని.. అంజన్న అని ఇలా రకరకాలుగా పిలుచుకుంటూ ఉంటారు. నిజానికి ఆంజనేయుడిని భక్త కోటి మొత్తం ఆపద్భాంవుడిలానే చూస్తుంది. కోరిక కోరికలు నెరవేర్చే అభయాంజనేయుడిగా చూస్తుంది. ఇక హనుమంతుని జననం గురించి అయితే రకరకాల కథలున్నాయి. వాటిలో ఒకటేంటంటే.. పుంజికస్థల అనే అప్సరస దేవగురువైన బృహస్పతి వద్దకు వెళ్లి ఏదేదో చెబుతూ విసిగిస్తోంది. ఆ సమయంలో ఆమె బృహస్పతికి చాలా అంద వికారంగా కనిపించిందట.

విసిగిపోయిన బృహస్పతి.. పుంజికస్థలను భూలోకంలో వానర కాంతగా జన్మించాలంటూ శాపమిచ్చాడట. దీంతో ఆందోళన చెందిన పుంజికస్థల తనకు శాపవిమోచన కలిగించాలని వేడుకుంది. అప్పుడు హనుమంతునికి జన్మనిచ్చిన తర్వాత ఇంద్రలోకానికి వస్తావని శాపానికి ఉపశమనం చెప్పాడు. ఈ క్రమంలోనే అంజనాదేవి పేరుతో పుంజికస్థల భూ లోకంలో వానర కాంతగా జన్మిస్తుంది. పెద్దయ్యాక కేసరి అనే అందమైన వానరాన్ని ప్రేమ వివాహం చేసుకుంటుంది. వారికి సంతానం కలగకపోవడం శివున్ని వేడుకుంటారు. అప్పుడు శివుని తేజమును పండు రూపంలో అంజనాదేవికి వాయుదేవుడు ఇస్తాడు. అది తిన్న అంజనాదేవి గర్భం దాల్చి ఆంజనేయునికి కిష్కిందా నగరంలో జన్మనిస్తుంది.

Share this post with your friends